ఐసీసీ వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ స్థానం దక్కింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ భారీ టోర్నమెంట్‌లో ఆడే భారత క్రికెట్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. తుది 15 మందిలో విజయ్ శంకర్‌కు చోటుదక్కింది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై వరల్డ్ కప్ టీమ్‌ను ఎంపిక చేసింది. ఇక, తాను ప్రపంచ కప్‌లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యానని తెలియగానే విజయ్ శంకర్ ఆనందం అంతాఇంతా కాదు.
తాను ఎంపిక అవుతానన్న విషయంపై నమ్మకం ఉన్నా, టీవీలో తన పేరు చూసుకోగానే సంతోషం పట్టలేకపోయానని తెలిపాడు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. మీడియాతో మాట్లాడుతూ, నేటితో తన కల నెరవేరినట్టయిందని అన్నాడు. వరల్డ్ కప్‌లో తాను కూడా ఆడుతున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ కెప్టెన్సీలో ఆడనుండడం మరింత ఉత్సాహాన్నిస్తోందని, సామర్థ్యం మేర రాణించడానికి ప్రయత్నిస్తానని విజయ్ శంకర్ తెలిపాడు. 28 ఏళ్ల విజయ్ శంకర్ ఇప్పటివరకు ఆడింది 9 వన్డేలే అయినా, మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. దానికితోడు బౌలింగ్‌లోనూ ఉపయుక్తంగా ఉంటాడన్న ఉద్దేశంతో ఆల్రౌండర్ కోటాలో విజయ్ శంకరేను ఎంపిక చేశారు. మరోవైపు, కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే సత్తా విజయ్ శంకర్‌లో పుష్కలంగా ఉందని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.