ఫిదా భామ స్టైలే వేరు… రూ.కోట్ల ఆఫర్‌ వద్దని చెప్పింది..

0
48

అందరూ హీరోయిన్లు ఒకలా ఉండరు. అందులోనూ ముఖ్యంగా సాయి పల్లవి రూటే సపరేటు. నటనలో, డ్యాన్సులో సాయి పల్లవి దరిదాపుల్లోకి రాగలిగే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ సాయి పల్లవి తన పాత్రలను ఆషామాషీగా ఎంచుకోదు.

తన పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కొంతమంది కొన్ని దాన్ని గర్వం అని కూడా అంటూ ఉంటారు. అయినా సాయి పల్లవి అలాంటివి అసలు పట్టించుకోదు. తాజాగా మరో భారీ ఆఫర్‌ను తిరస్కరించింది.

అయితే, ఇది సినిమా ప్రాజెక్టు కాదు. ఓ ప్రకటన యాడ్. ప్రముఖ కాస్మెటిక్స్ కంపెనీ కొత్తగా లాంచ్ చేయనున్న ఫేస్‌క్రీమ్‌కు బ్రాండ్ అంబాజిడర్‌గా వ్యవహరించమంటూ సాయిపల్లవిని సంప్రదించారట. ఈ డీల్ సైన్ చేస్తే రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. కానీ సాయి పల్లవి మాత్రం వారికి ‘నో’ చెప్పిందట.

సాయి పల్లవి దాదాపుగా మేకప్ లేకుండా సహజంగా నటించేందుకు ఆసక్తి చూపుతుంది. అందుకే సినిమాలో తన ఫేస్ పై మొటిమలు అలానే కనిపిస్తాయి. మరి తనే మేకప్ వేసుకోకుండా నేచురల్‌గా సినిమాల్లో నటిస్తుంటే ఇప్పుడు ఈ ఫేస్‌క్రీమ్‌కు ప్రమోషన్స్ చేయడం సరికాదు అనిపించి ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించిందట.