హాట్ పిక్చర్స్‌తో హీటెక్కిస్తున్న మందిరా బేడీ

0
35

పేరు మందిరా బేడీ. బుల్లితెర వీజేగా.. టాప్ మోడల్‌గా.. నటిగా.. మల్టీ ట్యాలెంటెడ్ గాళ్‌గా అభిమానులకు సుపరిచితం. అంతకుమించి నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో మరింతగా చేరువైంది. ఐపీఎల్ మ్యాచ్‌లలో మందిర విన్యాసాల విలాపాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని వ్యాపకాలు ఉన్న ఈ 46 వయసు బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరడం హాట్ టాపిక్‌గా మారింది.

డార్లింగ్ ప్రభాస్‌కి ధీటుగా పోరాటాలు సాగించే విలన్ గ్యాంగ్‌లో మందిర దమ్మెంతో చూపించబోతోందట. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్ వంటి బాలీవుడ్ స్టార్లతో కలిసి ఈ అమ్మడు కూడా ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో మందిరా పాత్ర పేరు కల్కి.

ఇటీవలే హైదరాబాద్‌లో జాకీష్రాఫ్‌తో పాటు కాంబినేషన్ సీన్స్‌లోనూ మందిర నటించింది. కొన్ని యాక్షన్ సీన్స్‌లో మందిర స్టంట్స్ మైండ్ బ్లోవింగ్ అనేలా తెరకెక్కించారని తెలుస్తోంది. అందులో హ్యాండ్ టు హ్యాండ్ యుద్ధ విన్యాసాల్ని అమ్మడు ప్రదర్శించిందిట. మొత్తానికి ప్రభాస్ అభిమానుల గుండెల్లో మంటలు పుట్టించే లేటు వయసు విలన్‌గా మందిర ఫీట్స్‌ని తెరపై చూడాల్సి ఉంటుందన్నమాట.