ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు.. ప్రభుదేవా, తమన్నాలకు దెయ్యం పడితే?

0
121

దేవి హారర్ థ్రిల్లర్ కేఎల్ విజయ్, తమన్నా, ప్రభుదేవా కాంబోలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వచ్చేస్తోంది. తెలుగులో ఈ సినిమా ‘అభినేత్రి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోనే కాకుండా ఈ సినిమా హిందీలోనూ సక్సెస్ అయింది. దాంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. ‘అభినేత్రి 2’ పేరుతో ఈ సినిమా రూపొందింది. ఈసారి ఈ సినిమాలో తమన్నాతో పాటు నందిత శ్వేత కనిపించనుండటం విశేషం.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రభుదేవా, తమన్నా, నందిత శ్వేత, కోవై సరళకు సంబంధించిన ఆసక్తి సన్నివేశాలతో టీజర్‌ను వదిలారు. తమన్నాతో పాటు ప్రభుదేవా కూడా ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనున్నట్టు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ‘ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు’ అని కోవై సరళ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.