హైదరాబాద్ నగరంలో మరో దర్శకుడు వెకిలి చేష్టలు వెలుగు చూశాయి. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ముసుగులో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చిన ఓ డైరెక్టర్ గుట్టును ఓ యువతి రట్టు చేసింది. బట్టలు విప్పితే నటన నేర్పిస్తానంటున్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వర్మ బండారాన్ని బయటపెట్టింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌కు వినయ్ వర్మపై ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బాధిత యువతితో పటు మరికొందరు యువతులు ఇటీవల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరగా డైరెక్టర్ వినయ్ వర్మ అందర్నీ బట్టలు విప్పమని కోరేవాడు.
యువతులతో పాటు యువకులూ బట్టలు విప్పాలన్నాడు. దీంతో షాక్ అయిన బాధిత యువతి బట్టలు విప్పడానికి నిరాకరించి, అక్కడ నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించి, లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. పైగా శిక్షణ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈమెకు మరికొంతమంది అమ్మాయిలు జతకలిశారు.
దీనిపై వినయ్ వర్మ స్పందిస్తూ, నటనలో పై దుస్తులు తీసేయడం కామన్ అని సెలవిస్తున్నారు. యాక్టింగ్‌పై ఆసక్తి లేకపోవడంతోనే ఆరోపణలు చేస్తుందని అంటున్నాడు. ఇక అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న వినయ్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ని మూసివేయాలన్నారు.