కోడికి తలకాయ ఉందో లేదో తెలియదుకానీ… అంబటి ఫైర్

0
98

కోడికి తలకాయ ఉందో లేదో తెలియదు కానీ, టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌కు మాత్రం బుర్రలేదని వైకాపా నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి లోకేశ్ చేసిన ట్వీట్‌పై అంబటి మండిపడ్డారు.

కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచి బతికిందని, జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చినప్పుడు, ఆ కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలలు బతకడం పెద్ద విచిత్రమేమీ కాదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ట్వీట్ చేశారు.

దీనిపై రాంబాబు మాట్లాడుతూ, ‘నిజంగా నువ్వే ఈ వర్డ్స్ ట్వీట్ చేస్తే ‘శభాష్’ అనాలి. ట్యూటర్ చెబితే రాసుకుని ట్వీట్ చేశావని ప్రపంచమంతా తెలుసు. కోడికి తలకాయ లేదేమో నాకు తెలీదు కానీ, నీకు అసలు బుర్ర లేదు. నీకు బుర్ర ఉంటే.. ఎమ్మెల్సీగా నీవు మంత్రివి ఎలా అవుతావయ్యా? నాకు అర్థం కాలేదు?

జగన్మోహన్ రెడ్డిపై కామెంట్ చేసే హక్కు నీకు లేదు. నీవు అంత శక్తిమంతుడివి కాదు. మీ నాన్న పంచన రాజకీయాలు చేసుకుని బతికే ఓ బుర్రలేని తత్వం కల్గిన వ్యక్తివి. 23వ తారీఖున మంగళగిరిలో ఏం జరుగుతుందో నువ్వు చూసిన తర్వాత, కోడికి తలకాయ ఉందో? లేదో? తెలిసిపోతుంది’ అని అంటూ రాంబాబు వ్యాఖ్యానించారు.