గర్భవతి అయిన గోవా బ్యూటీ?

0
40

త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసిన గోవా బ్యూటీ ఇలియానా. “పోకిరి” చిత్రంలో ఇలియానా న‌ట‌న‌తో పాటు ఆమె లుక్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఆరేళ్ళ క్రితం తెలుగు ఇండ‌స్ట్రీకి బైబై చెప్పిన ఈ నాజుకు భామ త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి ఫోటో షూట్స్ చేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చింది.

తాజాగా, మాస్ మహారాజా ర‌వితేజ చిత్రం “అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని”తో తెలుగు తెర‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఇలియానాకి పెద్దగా వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే కొన్నాళ్ళ నుండి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయ‌ని ఇలియానా జాన్ అబ్ర‌హం న‌టిస్తున్న హిందీ సినిమాకి ఓకే చెప్పింది. కానీ ఆ ప్రాజెక్ట్‌ నుండి అర్ధాంత‌రంగా త‌ప్పుకుంది. వేరే ప్రాజెక్ట్‌కి సంబంధించి ఊసే లేదు. దీనికంతటికి కారణం.. ఆమె గర్భవతి కావడం అని బీ టౌన్ కోడై కూస్తుంది.

విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇల్లీ బేబీ గ‌ర్భ‌వ‌తి అంటూ ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ లేక అభిమానులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇలియానా కాని లేదంటే ఆమె సన్నిహితులెవ‌రైన ఈ ఇష్యూపై రానున్న రోజుల‌లో స్పందిస్తారా అనేది చూడాలి.