ముదురు భామపై మనసుపడిన రానా

0
64

“నేనే రాజు నేనే మంత్రి” సినిమా తర్వా రానా దగ్గుబాటి తెలుగులో ‘కథానాయకుడు, మహానాయకుడు’ సినిమాలు చేశాడు. ఈ రెండింటిలో గెస్ట్ రోల్స్ మాత్రమే. స్ట్రెయిట్ హీరోగా చేసిన హిందీ, తమిళ, మలయాళం సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇదిలావుంచితే, తెలుగులో రానా “విరాట పర్వం 1992” సినిమా చేస్తున్నాడు. ‘నీది నాది ఒకటే కథ’ దర్శకుడు వేణు అడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 1992 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.

ఇకపోతే, విరాటపర్వం 1992లో ఓ సీనియర్ నటికి నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ పాత్ర కోసం తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు విజయ్ శాంతిని అనుకున్నారట. కానీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలో టబును తీసుకున్నారని తెలుస్తోంది. నాగార్జునతో ‘నిన్నేపెళ్ళాడుతా’ వంటి హిట్ సినిమాలు చేసింది.

2008లో వచ్చిన “పాండురంగడు” తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా టబు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అలాగే, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో కూడా ఆమె ఓ కీలక పాత్రను పోషించనున్న విషయం తెల్సిందే.