18-04-2019 గురువారం మీ దినఫలాలు

0
47
daily astro
daily astro

మేషం : ఉద్యోగస్తులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటంవల్ల అధికారులతో సమస్యలు తలెత్తగలవు. చిన్నతరహా పరిశ్రమలలోని వారికి పురోభివృద్ధి. స్త్రీలతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. చేపట్టిన పనులు ప్రగతిపథంలో సాగటంతో మీలో నూతనోత్సాహం, కొత్త ఆశలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం : ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.

మిథునం : నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బోనస్‌లు, అలవెన్సులు అందుతాయి. మీ పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన ధనం చేతికి అందటంతో రుణం తీర్చాలనే మీ ప్రయత్నం నెరవేరగలదు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.

కర్కాటకం : నూతన వ్యాపారాలు, పరిశ్రమల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులు అవుతారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఆహార, ఆరోగ్య విషయాలలో మెలకువ అవసరం. ఖర్చులకు వెనుకాడకుండా ధనం బాగా వెచ్చిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.

సింహం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామిక వ్యాపారాలలో మీ ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు సామాన్యంగా ఉంటాయి. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరచి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తారు. మెలకువ వహించండి.

కన్య : ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు, అలవెన్సులు మంజూరు అవుతాయి. కీలకమైన వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీ నిర్లక్ష్యంవల్ల విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఓర్పుతో వ్యవహరించటంవల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.

తుల : కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు డెప్యుటేషన్‌పై విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

వృశ్చికం : దంపతుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణివల్ల, మతిమరపువల్ల అధికారులతో మాటపడక తప్పదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సామాన్యం. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.

ధనస్సు : ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.

మకరం : ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దలవల్ల సమస్యలు తలెత్తగలవు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. పారిశ్రామిక రంగాల్లోని వారికి పురోభివృద్ధి. మొండి బాకీలు తీరుస్తారు.

కుంభం : విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. చేసే పనులలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. అనుకోని చెల్లింపులవల్ల ఆటుపోట్లు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం.

మీనం : విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. మీ శ్రీమతి కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.