ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ఓటు విలువ ఎంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ విషయం 77 యేళ్ళ ఎన్నికల భారతంలో ఈ విషయం పలుమార్లు ప్రస్ఫుటమైంది. అభ్యర్థుల తలరాతను మార్చే బ్రహ్మాస్త్రంగా అది మారింది కూడా. అంతటి ప్రాముఖ్యం కలిగిన ఓటు హక్కు అందరూ వినియోగించుకునే అవకాశం కల్పించాలని గమ్మర్ బామ్ అనుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో టిబెట్‌కు సరిహద్దు కొండల్లో ఉన్న అడవిలో మలోగామ్ గ్రామంలో నివసిస్తున్న సొకేలా తయాంగ్ అనే ఏకైక మహిళా ఓటరు కోసం ప్రిసైడింగ్ అధికారి గమ్మర్ బామ్ తన నలుగురు సిబ్బంది, ఓ సెక్యూరిటీ గార్డు, ఓ జర్నలిస్ట్‌తో కలిసి నాలుగు రోజుల పాటు 483 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తొలిదశ లోక్‌సభ ఎన్నికల్లో (ఏప్రిల్ 11న) సొకేలా తయాంగ్ ఓటు వేసేలా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కల్పించడం ముఖ్యమని బామ్ చెబుతున్నారు.