వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో “వాల్మీకి” అనే చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. గతంలో చేసిన ఏ సినిమాలోనూ కనిపించనటువంటి వినూత్న లుక్‌లో వరుణ్ కనిపిస్తున్నాడు.
గుబురు గడ్డం, చెవిపోగుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్ అయాంక్ బోస్‌కు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.