సినీ ఛాన్సుల కోసం పవన్ బైకులో తిరిగేవాడిని : సాయి తేజ్

0
50

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్. తాజాగా చిత్రలహరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సాయి.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించాడు. “నా చిన్నప్పుడు పెద్ద మామయ్య చిరంజీవి షూటింగులతో బిజీగా ఉండేవారు. పవన్ మామయ్య మాత్రం మాతోనే ఎక్కువగా ఉండేవారు. ఆయన మమ్మల్ని బయటికి తీసుకెళ్లడం.. బొమ్మలు కొనివ్వడం చేసేవారు. అందువలన ఆయనతో ఎంతో చనువు వుంది.

సినిమా ప్రయత్నాల దిశగా కూడా ఆయనే నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో ఆయనకి బజాజ్ ఎవెంజర్ బైక్ వుండేది. నేను సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడుతుంటే, ఆ బైక్‌ను వాడుకోమన్నారు. ఆ బైక్‌పైనే నేను సినిమా ఆఫీసులకి తిరుగుతూ నా ఫోటోలు.. ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. నేను ఫలానా అని ఎవరికీ చెప్పేవాడిని కాదు.

ఏ మాత్రం అవకాశం ఉన్నా కాల్ చేస్తామని అనేవారు. కానీ ఎవరి నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఆ తర్వాత మంచు మనోజ్‌తో కలిసి క్రికెట్ ఆడుతుంటే వైవిఎస్ చౌదరి చూసి తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు” అని చెప్పుకొచ్చాడు.