19-04-2019 శుక్రవారం దినఫలాల

0
69

మేషం : ప్రైవేటు సంస్థలవారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరగలదు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. చిన్నారులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం : గృహ సమస్యలు పరిష్కారం కాగలవు. విద్యార్థులు స్వయంకృషితో బాగా రాణిస్తారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. గృహంలో వేడుకల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.

మిథునం : బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ వహించండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పనివారలతో చికాకులు ఎదురవుతాయి. స్త్రీలు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

కర్కాటకం : ఆర్థిక విషయాలలో సంతృప్తి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారులతో అవగాహన కుదరదు. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు.

సింహం : ఉపాధ్యాయులు ఒత్తిడి, సమస్యలకు లోనవుతారు. ముఖ్యులమధ్య అభిప్రాయబేధాలు తొలగిపోతాయి. ఏదైనా అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడుతుంది. ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లోని వారికి పనివారితో చికాకులు తప్పవు. తలపెట్టిన పనులు పునఃప్రారంభం అవుతాయి. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడి కోసం ప్రయత్నిస్తారు.

కన్య : ప్రైవేటు సంస్థల్లోనివారు రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు. రుణం ఏ కొంతైనా తీరుస్తారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. నూతన వ్యక్తుల పరిచయంవల్ల కొత్త అనుభూతి కలుగుతుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో తరచూ పాల్గొంటారు. ప్రయాణాలలో అసంతృప్తిని ఎదుర్కొంటారు.

తుల : తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. ప్రేమికులకు పెద్దలతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. స్థిరచరాస్తులు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఎదురవుతాయి. స్త్రీలకు నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి.

వృశ్చికం : చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. బేకరీ, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకింగ్ రంగాలలోని వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పీచు, ఫోం, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి.

ధనస్సు : ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలసి రాగలదు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విదేశీయానం కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మకరం : ఆర్థికంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. చేపట్టిన పనిలో ఒత్తిడి, జాప్యం తప్పవు. కోర్టు వ్యవహారాలలో ఆందోళన అధికం అవుతుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ అవసరం. ప్రేమికుల మధ్య ఆలోచనలు స్ఫురిస్తాయి.

కుంభం : గృహానికి కావలసిన విలువైన వస్తువులను అమర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిళ్లు, చికాకులు క్రమంగా తొలగిపోతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం లభిస్తుంది.

మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. మిత్రుల నుంచి ఆహ్వానాలు, బహుమతులు అందుకుంటారు. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త. నిరుద్యోగుల ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి.