వేసవి కాలంలో చీమలూ, జెర్రులతోపాటూ చిన్నపాటి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కీటకాల సమస్యకు పరిష్కారాలేంటో తెలుసుకుందాం.
* ప్రతిరోజూ కీరదోస సలాడ్లు తినే అలవాటుంటే దోసకాయ చెక్కుని పారేయొద్దు. చీమలు ఎక్కువగా ఉన్న చోట వాటిని పెట్టండి. ఆ వాసనకి చీమలు రావు.
* అరచెంచా దాల్చిన చెక్క నూనెలో కొద్దిగా నీళ్లు కలిపి దూదిని కానీ, వస్త్రాన్నీ కాని ముంచి చీమలూ, క్రిములు వచ్చే బొరియల దగ్గర రాస్తే ఆ వాసనకి చీమలు దరిచేరవు.
* చీమలు మనం పడుకునే చోట, కిటికీల దగ్గర ఒక దారిపెట్టుకుని వెళ్తూ ఉంటాయి. అక్కడ నిమ్మరసంలో దూదిని ముంచి చీమలు వెళ్లే దారిలో రాసి చూడండి. అన్నీ వెళ్లిపోతాయి.
* వైట్‌వెనిగర్‌లో కొంచెం నీళ్లను కలిపి స్ప్రేబాటిల్‌లో పోసి చీమలు, క్రిములు ఉన్నచోట చల్లితే అవి రాకుండా ఉంటాయి.