‘కలర్స్ స్వాతి’ రీ ఎంట్రీకి సిద్ధం..

0
58
Colors Swathi
Colors Swathi

బుల్లితెరపై ప్రసారమైన కార్యక్రమం “కలర్స్”. ఆ తర్వాత వెండితెర‌పైనా త‌న‌దైన ముద్ర వేసింది. ఆ తర్వాత ‘క‌ల‌ర్స్’ స్వాతి పేరుతో మంచి గుర్తింపు పొందింది. తెలుగుతోపాటు త‌మిళంలోనూ గుర్తుంచుకోద‌గ్గ సినిమాలు చేసింది. మంచి న‌టిగా గుర్తింపు సంపాదించుకుంది. అదేసమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

ఈ క్రమంలో ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఆమె తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. అనుకున్న‌ట్టుగానే త్వ‌ర‌లో ఓ సినిమా ద్వారా స్వాతి రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌.

గ‌తంలో నిఖిల్, స్వాతి క‌లిసి న‌టించిన ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగాన్ని రూపొందించిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ సినిమాను కూడా తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో స్వాతి రోల్ ఉంటుంద‌ట‌. స్వాతితోపాటు వేరే హీరోయిన్ కూడా ఈ సినిమాలో న‌టించ‌బోతోంద‌ట‌. అయితే స్వాతిదే కీల‌క పాత్ర అని తెలుస్తోంది.