కేసీఆర్ నిజమైన మగాడు అంటున్న శ్రీరెడ్డి

0
47

తెలుగు చిత్రపరిశ్రమల మీటూ ఉద్యమానికి ఊపిరి పోసిన నటి శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే లైంగిక వేధింపుల‌ను వెలుగులోకి తీసుకు రావడమేకాక కొన్ని పెద్ద పేర్లు కూడా బయట పెట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇపుడు హైదరాబాద్‌ను వీడి చెన్నైలో ఉంటోంది.

ఈమె ప్రస్తుతం తెరాస అధినేత కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జీవో పాస్ చేయడాన్ని ఆమె స్వాగతించారు. దీంతో ఇది తన పోరాటానికి దక్కిన గౌరవమన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో దీనిపై ఒక పెద్ద పోస్టుని పెట్టింది శ్రీరెడ్డి.

“ఒక హైదరాబాద్ అమ్మాయిగా నాకు చాలా గర్వంగా ఉంది. నిజమైన హీరో కెసిఆర్‌కు నా ధన్యవాదాలు. ఇవాల్టితో నా కల నెరవేరింది. ఇవ్వాళ నన్ను ఒక హీరోయిన్‌గా గుర్తిస్తున్నారు. సంవత్సర కాలంగా నేను పడ్డ ఆవేదనకి ఇప్పుడు మంచి ఫలితం దక్కింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో పాస్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఆనాడు నేను అర్థనగ్నంగా నిలబడినందుకు వచ్చిన ఫలితం ఇది. ఇందులో ముఖ్యమైన వాళ్లు సంధ్య, వాసుద, సజయ, తేజ్.. లవ్ యూ ఆల్. అందరికీ నా కృతజ్ఞతలు” అంటూ శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.