పాదాల దుర్వాసన వస్తుందా?

0
38

వేసవి కాలంలో చెమట కారణంగా పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ప్రతి రోజూ సాయంత్రం పూట ఇంటికి రాగానే, లేదంటే ఉదయం బయటకు వెళ్లే ముందు గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి కాసేపు పాదాల్ని అందులో ఉంచాలి. ఓ 20 నిమిషాల తర్వా కడిగేసుకోవాలి. దీనివల్ల దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నశించిపోతుంది.

* నాలుగు చెంచాల వంటసోడాలో ఒక చెంచా నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పాదాలకు పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కాళ్లను కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* లావెండర్ నూనె వాసనకే కాదు, చెడు బ్యాక్టీరియాతో పోరాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. గోరువెచ్చటి నీటిలో కొన్ని చుక్కల నూనెను కలిపి దూదితో పాదాలను తుడుచుకోని కాసేపు తర్వాత కడిగేస్తే చాలు.

* అరబకెట్‌ నీటిలో ఒక కప్పు వెనిగర్‌ వేసి అందులో పాదాలను ఉంచాలి. అరగంటయ్యాక శుభ్రంగా కడిగి తువాలుతో తుడిచి పౌడరు రాయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

* రెండు గ్లాసుల నీళ్లలో నాలుగైదు బ్లాక్‌ టీ బ్యాగులను వేసి బాగా మరిగించాలి. అర బకెట్‌ నీటిలో ఈ డికాక్షన్‌ని కలిపి పాదాల్ని అందులో ఉంచాలి. టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు బ్యాక్టీరియాను తొలగించి దుర్వాసనను తొలగిస్తాయి. ఇలా వారానికోసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.