బీజేపీని వేలెత్తి చూపితే వేళ్లు నరికేస్తా.. కళ్లు పీకేస్తా : మనోజ్ సిన్హా

0
51
manoj sinha
manoj sinha

కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా నోరుజారారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఆయన ప్రసంగించారు. బీజేపీని విమర్శించేవారిని ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు.

బీజేపీ శ్రేణుల పనితీరును విమర్శిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే నాలుగ్గంటల్లో వాళ్ల అంతు తేలుస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైపు వేలెత్తి చూపితే వాళ్ల వేళ్లు నరికేస్తా, కళ్లు పీకేస్తా అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో అవినీతి నిర్మూలనలోనూ, అక్రమ ధన ప్రవాహాన్ని అడ్డుకోవడంలోనూ బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించిందని మనోజ్ సిన్హా తెలిపారు.

ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు ఇదేమీ కొత్తకాదు. గతవారం మవుపారా గ్రామంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయ్యుంటే ఈరోజున ఉగ్రవాద భూతం ప్రజలను పీడించేది కాదని, కాంగ్రెస్ విధానాలే ఉగ్రవాదానికి ఊతమిచ్చాయని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.