20-04-2019 శనివారం మీ రాశిఫలాలు

0
52

మేషం : ఆర్థికంగా స్థిరపడతారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు మెండుగా లభిస్తాయి. కొన్ని కార్యాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి.

వృషభం : ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులు అవుతారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గృహంలో వేడుకను నిర్వహిస్తారు.

మిథునం : తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఆశాజనకం. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. వస్త్రములు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి.

కర్కాటకం : స్త్రీల సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం లభిస్తుంది. కళాకారులు అధికమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకం.

సింహం : ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించటంతో వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి.

కన్య : దైవ దర్శనాలలో తరచూ పాల్గొంటారు. వేడుకలలో పాల్గొంటారు. బంధువుల ద్వారా అత్యంత కీలక సమాచారం అందిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి సమస్యలు తప్పవు. సభ, సమావేశాలలో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థల వారికి మార్పు కానరాగలదు. స్త్రీలు పోటీలలో విజయం సాధించి ప్రముఖుల నుంచి బహుమతులు అందుకుంటారు.

తుల : గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. ప్రైవేటు సంస్థల వారికి మార్పు కానరాగలదు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగానీ ఫలితం దక్కదు. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చికం : సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచనను అమలులో పెడతారు. స్త్రీలు ఆడంబరాలకుపోయి సమస్యల్ని కొని తెచ్చుకోవద్దు. దైవదీక్షలు విరమిస్తారు. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధాలు బలపడతాయి. వాహన కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు : శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు, వస్త్రప్రాప్తి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వాములమధ్య ప్రయోజనకరమైన విషయాలు చర్చకు వస్తాయి.

మకరం : బంధుమిత్రుల రాకతో స్త్రీలకు పనిబారం అధికం అవుతుంది. ఖర్చులు, రాబడుల విషయంలో ఏకాగ్రత అవసరం. వ్యాపారాలలో పోటీ నిరుత్సాహపరుస్తుంది. మీ ఆత్మీయుల కోసం, సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాల్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

కుంభం : స్త్రీలకు ఆరోగ్యపరంగానూ, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. మీ ఆకస్మిక ధోరణి కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలిసి శుభాకాంక్షలు అందిస్తారు. స్నేహితులతో కలిసి పార్టీలు, వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కుటుంబంలో అదనపు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. పెద్దల ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం.

మీనం : కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నూతన వ్యక్తుల కలయికవల్ల మీలో ఉత్సాహం కలసివస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ధనం నిల్వ చేయాలనే మీ సంకల్పం నెరవేరదు. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ప్రముఖులను కలుస్తారు.