టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌పై యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసల వర్షం కురిపించారు. గొప్ప ట్యాలెంట్ ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్ అని వ్యాఖ్యానించారు.
“చి.ల.సౌ”తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విజయం అందుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్. ఈయన దర్శకత్వంలో హీరో నాగార్జున ‘మన్మథుడు-2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో వచ్చిన ‘మన్మథుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్లో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
ఓ హిందీ సినిమా కోసం చాలా సన్నగా మారిపోయిన రకుల్ లుక్ నాగ్‌కు నచ్చలేదని, తన పక్కన సూట్ కాదని ఆయన భావిస్తున్నారని వార్తలు బయటకు పొక్కాయి. అందుకే రకుల్‌తో తీయాల్సిన సీన్లను ఆపమని దర్శకుడిని నాగ్ కోరినట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఈ వార్తలపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ పుకార్లను ఖండిస్తూనే రకుల్‌తో ఎలాంటి ఇబ్బందులూ లేవని స్పష్టం చేశాడు. ‘షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి రకుల్ యూనిట్‌తోనే ఉంది. ఆమె గొప్ప ట్యాలెంట్ ఉన్న నటి. సినిమా చాలా బాగా వస్తోంద’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.