బుల్లితెర యాంకర్, గుంటూరు టాకీస్ హీరోయిన్ రష్మి గౌతమ్‌కి పిచ్చకోపమొచ్చింది. అమ్మాయిలను రేప్ చేసే కిరాతక నా కొడుకలకు దాన్ని కోసిపారెయ్యాలని ఘాటుగా ట్వీట్ చేసింది.
శుక్రవారం రాత్రి కన్నతల్లి ఎదుటే ముగ్గురు కామాంధులు ఓ యువతిపై అత్యార యత్నానికి ప్రయత్నించారు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ముఖంపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ ఘటనపై స్పందిస్తూ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు. తన బాధ, ఆవేదనను తెలియజేశారు.
‘ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో ఓ కొత్త కేసు నమోదవుతూనే ఉంది. గతంలో జరిగిన సంఘటనల కంటే.. ఇప్పుడు జరిగేవి ఎంతో భయానకంగా ఉంటున్నాయి. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడేవాళ్లను పట్టుకొని అది కోసిపారేయాలి.. లేకపోతే ఒక్క రాత్రిలోనే ఆడదన్నది కనిపించకుండా పోతుంది. అప్పుడు కానీ ఈ మానవాళికి, సమాజానికి ఆడవాళ్ల విలువ తెలుస్తుంది’ అన్నారు.
బీహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనపైనే రష్మి స్పందించింది. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు మద్దతు పలికారు.