బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటనకు ఫిదా కాని ప్రేక్షకుడంటూ ఉండరు. ఈమె తొలి నుంచి సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు. తను నటించే కథలలలో పాత్రలలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడేది. అందుకే విద్య దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.
ఈ మధ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యా బసవతారకం పాత్రలో నటనకు భారీగా ప్రశంసలు అందుకున్న విషయం తెల్సిందే. ఇదిలావుంటే విద్య ఈమధ్య ఒక క్రేజీ ప్రాజెక్టుకు నో చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో టైటిల్ రోల్ కోసం మొదట విద్యానే సంప్రదించారట. మొదట సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిందని.. కాకపోతే తర్వాత తనకున్న ఇతర కమిట్మెంట్ల కారణంగా చేయలేకపోతున్నానని ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్టు వార్తలు వచ్చాయి.
కానీ అసలు కారణం అది కాదట. విద్య హిందీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంపై తెరకెక్కే బయోపిక్‌లో నటిస్తోందట. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను విద్యాబాలన్ పోషిస్తోంది. ఒకేసారి రెండు బయోపిక్స్‌లో నటించడం ఎందుకని జయలలిత బయోపిక్‌కు నో చెప్పిందట.