నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా, ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ “జెర్సీ”. ఈ చిత్రం 19వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే మౌత్ టాక్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకోవడమేకాక, నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. నాని కెరీర్‌లో ‘జెర్సీ’ మైలురాయిగా మిగిలిపోతుందని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.
ఇకపోతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మొదటిరోజు రూ.4.5 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.5.5 లేదా రూ.6 కోట్ల మధ్యలో ఉండొచ్చని చెప్తున్నారు. ఇక వీకెండ్‌లోనూ జెర్సీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటే అవకాశం పుష్కలంగా ఉంది. త్వరలో మరికొద్ది థియేటర్స్ యాడ్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.