నిజం తెలుసుకుని నేమ్ ప్లేట్‌ను మాయం చేశారు.. చంద్రబాబు

0
34
chandrdababu naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటూ ఇటీవల వైసీపీ అధినేత పేరుతో సోషల్ మీడియాలో ఓ నేమ్ ప్లేట్ వైరలైంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

తన పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో నిర్వహించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, వైసీపీ గెలుస్తుందనే నమ్మకంతో సీఎం పేరుతో నేమ్ ప్లేట్ సిద్ధం చేసుకున్నారని, అనంతరం అసలు నిజాలు తెలియడంతో ఆ పార్టీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు.

తనకు అధికారులపై ఎలాంటి ద్వేషమూ లేదన్న చంద్రబాబు, అధికారులపై ఉన్న కేసులు, జగన్ వల్ల కలిగిన ఇబ్బందులను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అంతేకాకుండా, అధికారులపై తనకు ఎలాంటి వ్యతిరేక భావనలు లేవని, వారిని బాధపెట్టాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కొందరు అధికారులపై ఉన్న కేసులు జగన్ వ్యవహారానికి సంబంధించినవని, అవి ఇంతకుముందే పెట్టిన కేసులని తెలిపారు.

అయితే, రాష్ట్రంలోని ప్రజలు, సాగునీరు, తాగునీటికి ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆంక్షలు విధించడం సరికాదని అన్నారు. “నా మీద ఆంక్షలు విధిస్తే నేను పోరాడుతా. లేకపోతే, అందరిపైనా ఆంక్షలు విధించండి, నాకేమీ ఇబ్బందిలేదు, నేనూ స్వాగతిస్తా. మేమే దేశాన్ని పరిపాలిస్తాం, మేమే రాష్ట్రాలను పరిపాలిస్తాం అంటే చెయ్యండి! ప్రజాస్వామ్యాన్ని కాదనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.

నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. నా బాధ ఏంటంటే, ఎందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇన్ని కఠిన ఆంక్షలు వర్తింపజేస్తున్నారు? నేను మీపై పోరాడుతున్నాను అనా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకెళుతున్నాను అనా? వీవీ ప్యాట్లు లెక్కించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అనా? అసలేంటి మీ సమస్య?” అంటూ నిలదీశారు.