అందాలు ఆరబోస్తున్నా దక్కని విజయం.. ఎందుకిలా?

0
49

రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీ రాయ్ అలియాస్ రత్తాలు. సినీ ఇండస్ట్రీలో గ్లామర్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘రత్తాలు రత్తాలు’ ఇరగదీసే స్టెప్పులతో మెప్పించింది. అతేనా, టాలీవుడ్ ప్రేక్షకుల చేత మాస్ స్టెప్స్ వేయించింది.

తాజాగా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఆమెకు మాత్రం గుర్తింపు, హిట్ అనేవి అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో రావలసినంత గుర్తింపు రాలేదన్న ప్రశ్నకు లక్ష్మీరాయ్ తనదైనశైలిలో సమాధానమిచ్చింది.

‘ఇక్కడకు (సినిమాల్లోకి) వచ్చినప్పటి నుంచీ ఆ బాధ ఉంటూనే ఉంది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తరువాత బాలీవుడ్‌లో ‘జూలీ 2’లో అవకాశమొచ్చింది. నాకు చెప్పింది వేరు. చూపించింది వేరు. సినిమా ప్రమోషన్లలో కూడా నా గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో అక్కడ రావలసినంత గుర్తింపు రాలేదు.

ఆ ఒక్క సినిమా అనే కాదు. చాలా సినిమాల విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దానికి తోడు సినిమాల ఎంపికలో నేను చేసిన కొన్ని తప్పులు సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అన్న పేరుకు దూరం చేశాయి. అయినా జరిగిపోయిన వాటి గురించి బాధ పడను. ఇప్పుడు నా కెరీర్‌ బాగుంది. స్టార్‌ హీరోల పక్కన చేసే అవకాశాలొస్తున్నాయి’ అని ఆమె చెప్పుకొచ్చింది.