ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా.. చెర్రీ

0
44

మెగా ఫ్యామిలీ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్టు అవార్డు వరించింది. ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ వంటి అంశాల్లో ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.

దీనిపై తన భార్య ఉపాసనపై హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం ఫేస్‌బుక్‌లో రామ్ చరణ్ స్పందిస్తూ..’ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా’ అంటూ ఆప్యాయంగా పోస్ట్ చేశాడు.

ఈ అవార్డు తనకు రావడంపై ఉపాసన స్పందిస్తూ.. ‘నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.