‘బిగ్ బాస్’ షో హోస్ట్‌గా టాలీవుడ్ స్వీటీ

0
76

బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకుంది. త్వరలో మూడో సీజన్ ప్రారంభంకానుంది. అయితే, ఈ సీజన్‌కు హోస్ట్‌గా ఎవరన్నదానిపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

తొలి రెండు షోలకు టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్‌గా వ్యవహిరించారు. ఇపుడు మూడో సీజన్‌కు హీరో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి పేర్లు బలంగా వినిపించాయి. కానీ, వారు రేసులో లేనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 3 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ షో ప్రారంభం కానుందట. అయితే ఈ షో కోసం మొదట ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయాలనుకున్నారట కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోతున్నారని సమాచారం.

ఇపుడు ఆ బాధ్యతలను టాప్ హీరోయిన్‌కి అప్పజెప్పారని ఓ ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఆమె మరెవరో కాదు స్వీటీ అనుష్క అంటున్నారు. స్టార్ హీరోలకు దీటుగా వెండితెరపై అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న కారణంగా ఆమెను ఈ షో నిర్వాహకులు సంప్రదించారని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!