ఒకప్పుడు అంతర్ యుద్ధంతో శ్రీలంకలో నిత్యం రక్తం ఏరులై పారేది. ఎల్టీటీఈ తీవ్రవాదులు ఇష్టానుసారంగా బాంబు పేలుళ్ళకు తగెబడేవారు. 2006 వరకు వరుస ఉగ్రదాడులు, రాజకీయ నాయకుల హత్యలతో లంకలో భయానక వాతావరణం ఉండేది.
2009లో లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)ని పూర్తిగా నిర్మూలించారు. ఆ తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. మళ్లీ ఇపుడు అంటే పదేళ్ల అనంతరం వరుస బాంబు దాడులతో శ్రీలంక మరోసారి రక్తంతో తడిచిపోయింది. గతంలో ఇక్కడ జరిగిన మారణకాండను ఓసారి పరిశీలిస్తే..
1985- శ్రీమహా బోధి దాడి: అనురాధాపురలో 146 మంది సన్యాసులు, సన్యాసినులు, పౌరులను ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
1987- అలుత్ క్యా మారణకాండ: 127 మంది సింహళీయులను ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
1987- శ్రీలంక పార్లమెంటుపై దాడి: పార్లమెంటు లోపల ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో ఇద్దరు చనిపోయారు.
1987- బాంబు దాడి: కొలంబోలోని బస్టాండులో కారు బాంబు పేలి 113 మంది మృతి చెందారు.
1990- మసీదులో నరమేధం: కాట్టన్‌కుడిలోని ఓ మసీదులో ఎల్టీటీఈ ఉగ్రవాదులు కాల్పులు జరిపి 147 మంది ముస్లింలను చంపేశారు.
1992- పల్లుయగొడెల్ల మారణకాండ: ఎల్‌టీటీఈ ఉగ్రదాడిలో 285 మంది ప్రాణాలు కోల్పోయారు.
1996- బాంబు దాడి: కొలంబో సెంట్రల్ బ్యాంకు మెయిన్ గేట్ వద్ద బాంబులతో నింపిన ట్రక్కుతో ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు దాడి చేసి 91 మందిని హత్య చేశారు.
2006- దిగంపతన బాంబు దాడి: 15 మిలటరీ బస్సులను లక్ష్యంగా చేసుకొని బాంబులతో నింపిన ట్రక్కుతో ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు దాడి చేసి 120 మందిని చంపేశారు.
2019 – కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటల్స్ లక్ష్యంగా చేసుకుని జరిపిన వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో 250 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు.