బాలీవుడ్ డిజాస్టర్ కళంక్..

0
77

ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం “కళంక్”. ఈ చిత్రాన్ని అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మించారు. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రం ఈనెల 17వ తేదీన విడుదలైంది.

ప్రధానమైన పాత్రల్లో కనిపించే నాయకా నాయికలంతా విపరీతమైన క్రేజ్ కలిగిన వాళ్లే. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను ఈ సినిమా తారుమారుచేసింది. భారీ తారాగణం ఈ సినిమాను ఎంత మాత్రం కాపాడలేకపోయింది. కరణ్ జొహార్ తండ్రి యష్ జొహార్ డ్రీమ్ ప్రాజెక్టు ఇది. కొన్ని కారణాల వలన ఆయన ఈ కథను తెరపైకి తీసుకురాలేకపోయారు.

తండ్రి కోరికను నెరవేర్చాలనుకున్న కరణ్ జొహార్‌కి భారీ నష్టాలు తప్పడం లేదని చెప్పుకుంటున్నారు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. వారం రోజుల్లో ఈ సినిమా రూ.75 కోట్ల మార్కును కూడా దాటలేకపోయింది. దాంతో రూ.50 కోట్లకి పైగా నష్టాలు రావొచ్చనే అభిప్రాయాలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.