కొందరి కళ్లు చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటాయి. విశాలంగా ఉండటమే ఒక కారణమైతే, విల్లులా వంపులు తిరిగిన కనుబొమ్మలూ రెప్పల వెంట్రుకలు దట్టంగా ఉండటం మరో కారణం. కొందరికి ఇవి ఊడిపోతుండటంతో కనుబొమ్మలు పలుచబడి బోసిగా అనిపిస్తాయి. వోత్తుగా కనుబొమ్మలు పెరాగాలంటే…
* నిమ్మతొక్కని చిన్నముక్కల్లా చేసి పావుకప్పు ఆముదం లేదా ఆలివ్‌నూనెలో రెండు మూడు రోజులు పాటు బాగా నాననివ్వాలి. ఆ తర్వాత రోజూ రాత్రిపూట కనురెప్పలకి రాస్తే అందులో ఉండే విటమిన్ ఎ సిల కారణంగా త్వరగా పెరుగుతాయి.
* రెండుచుక్కల ఆముదంలో ఒక చుక్క లావెండర్ లేదా వేప నూనె వేసి బాగా కలిపి జాగ్రత్తగా కనురెప్పలకి రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. రోజు క్రమం తప్పక చేస్తుంటే ఆముదంలోని ఫ్యాటీ ఆమాల్ల వల్ల వత్తుగా పెరుగుతాయి. ఆముదం వద్దనుకుంటే ఆలివ్, బాదం నూనె లేదా కొబ్బరినూనె రాసినా మంచిది. కల్తిలేని పెట్రోలియం జెల్లీని రాత్రిపూట రోజూ రాసూకున్నా మంచిదే.