వ్యాధి నిరోధక ఔషధం పసుపు

0
39

* మనం రోజూ వంటల్లో వాడే పసుపు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఎన్ని వ్యాధుల్ని నిరోధిస్తుందో మనకు తెలియంది కాదు. అంతేకాదు, డిప్రెషన్, ఒత్తిడి కూడా తగ్గినట్లు తేలడంతో ప్ర‌పంచవ్యాప్తంగా పసుపు వాడకం భారీగా పెరిగిపోయింది.

* పసుపులోని కుర్‌క్యుమిన్ ఓ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ అనీ ఇది ఇన్‌ప్లమేషన్‌కి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేయడం ద్వారా క్యాన్స‌ర్లను రానివ్వకపోవడంతోబాటు, పక్షవాతం, ఆల్జీమర్స్, వంటి వ్యాధుల్ని రానివ్వదనీ నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది.

* ఆల్లిమర్స్ వచ్చే అవకాశం ఉన్నవాళ్లని ఎంపికచేసి ఆరునెలల పాటు వాళ్లకి తగుమోతాదులో పసుపుని ఇవ్వడం వల్ల మతిమరుపు తగ్గి, జ్ఞాపకశక్తి పెరిగినట్లు గుర్తించారు మన నిపుణులు.