కొబ్బరినీళ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లను చాలా మంది వేసవిలో తాగేందుకే ఇష్టపడుతుంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని ఏ కాలంలోనైనా తాగవచ్చు. కొబ్బరినీళ్లను తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా, ప్రతి రోజూ పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి.
* అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
* మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది.
* డీహైడ్రేషన్ బారిన పడే వారు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మంచిది.
* రోజూ పరగడుపున కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు బయటకు వెళ్లిపోతాయి.
* మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి.
* శరీరానికి కొత్త శక్తి వస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
* చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
* కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. నేత్ర సమస్యలను పోగొడతాయి.