అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంత జోరుమీదుంది. ముఖ్యంగా, యువ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దశ తిరిగినట్టుంది. వివాహం తర్వాత ఆమె నటిస్తున్న ప్రతి చిత్ర సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఫలితంగా ఆమె డిమాండ్ చేసే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతోంది.
గత యేడాది ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మిగతా హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఏడాది ‘సూపర్ డీలక్స్’ తమిళ మూవీతో బోణీ కొట్టిన సామ్ వారం తిరక్కుండానే ‘మజిలీ’తో సూపర్ హిట్టు అందుకొని అందరూ తన గురించి మాట్లాడుకొనేలా చేసుకుంది. దీంతో సమంతా డిమాండ్ ఓ రేంజ్లో పెరిగిపోయిందట.
ప్రస్తుతం తెలుగులో ’96’ రీమేక్ మూవీతో పాటు తన మామ, సీనియర్ హీరో నాగార్జున ‘మన్మథుడు -2’లోనూ కథానాయికగా నటిస్తోన్న సమంత పలువురు దర్శక,నిర్మాతల్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. అందరికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అదే సమయంలో తన పారితోషికాన్నీ ఓ రేంజ్లో డిమాండ్ చేస్తూ అందరికీ షాకిస్తోంది.
ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఇప్పుడు సమంత తన పారితోషికాన్ని రూ.3 కోట్ల దాకా చెబుతోందట. ఈ మోడరన్ జనరేషన్లో పెళ్ళయ్యాక ఇంత భారీ మొత్తం అందుకుంటోన్న ఒకే ఒక్క హీరొయిన్ సమంత అంటూ ఓ పెద్ద కాంప్లిమెంట్ను అందుకుంటోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ డిమాండ్‌లో ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ సైతం కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ ఇవ్వడానికే వెనుకాడే నిర్మాతలు సమంతకి మాత్రం రూ.3 కోట్ల వరకూ పారితోషికాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఆమె రేంజ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో అర్ధమవుతోంది.