పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన నటి సన్నీలియోన్. తాజాగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో సన్నీలియోన్ ఓ చిన్నపాప, ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఉన్నది ఎవరని అర్భాజ్ ఖాన్ అడిగాడు. ఈ ఫొటో గురించి చెబుతున్న సందర్భంలో సన్నీలియోన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు యథాతథంగా..
“మా క్యాస్ట్ అండ్ క్రూకు చెందిన వ్యక్తి ప్రభాకర్. నేను ఈ ఫొటో పోస్ట్ చేసే సమయానికి అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనిపైనే ఆధారపడి అతని తల్లి, భార్య, పిల్లలు జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. నా భర్త డానియల్, నేను అతనికి ఆర్థికంగా సాయపడినట్టు చెప్పుకొచ్చారు.
అతని కిడ్నీలు 10 శాతానికి తక్కువగానే పనిచేస్తున్నాయి. అతను కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తి అని నాకు తెలుసు. అతని వైద్య ఖర్చుల కోసం విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో ఆ ఫొటోతో కూడిన పోస్ట్ పెట్టాను. అతని కోసం మేం చాలా చేయాలనుకున్నాం. కానీ ఏమీ చేయలేకపోయాం. అతను చనిపోయాడు” అని సన్నీలియోన్ కన్నీటి పర్యంతమయింది.