ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో గాయపడిన తారక్‌

0
54

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో హీరో రామ్ చరణ్ గాయపడి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇంతలోనే మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఎన్టీఆర్ వెళ్లారని, ఆ సమయంలో ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉన్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

దీంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడని ప్రచారం జరగుతోంది. ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎన్టీఆర్ చేతికి ఉంది రిస్ట్ బ్యాండ్ అని ఆయన అభిమానులు అంటున్నారు.

కాగా, ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుంటే, ఇందులో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లురి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.