కంగనకు చిరునవ్వే నా ఆన్సరంటున్న హీరోయిన్

0
66

బాలీవుడ్ నటీమణులు అలియా భట్ – కంగనా రనౌత్‌ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గునమండిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ అలియా భట్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తోంది. దీనికికారణం లేకపోలేదు.

గతంలో కంగనా నటించిన చిత్రం “మణికర్ణిక”. ఈ చిత్రంలో కంగనా నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. కానీ, అలియా మాత్రం నోరు మెదపలేదు. అప్పటి నుంచి అలియాను కంగనా టార్గెట్ చేశారు. సందర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కంగ‌నా, ఆమె సోద‌రి రంగోలి విమ‌ర్మిస్తున్నారు. ఆలియా కుటుంబ స‌భ్యుల‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌పై ఆలియా స్పందించింది. ‘నా కంటే నా కుటుంబంలో ప‌ది రెట్లు ఎక్కువ ప‌రిణితి గ‌ల వ్య‌క్తులున్నారు. అందుకే నేను ఈ విమ‌ర్శ‌ల జోలికి వెళ్లాల‌నుకోవ‌డం లేదు. రోజురోజుకూ మ‌రింత మెర‌గ‌య్యేందుకే నేను ప్ర‌య‌త్నిస్తాను. జ‌నాల అభిప్రాయాల‌ను పట్టించుకోద‌ల‌చుకోలేదు. ప్ర‌తీ ఒక్కరికీ మాట్లాడే హ‌క్కుంది. వారికి న‌చ్చింది వారు మాట్లాడ‌తారు. నేను మాత్రం కామ్‌గానే ఉంటాను. ఎప్ప‌టికీ ఇదే నా స్టాండ్’ అని అలియా చెప్పుకొచ్చింది.