మరోమారు యాంకర్‌గా టాలీవుడ్ ‘మన్మథుడు’?

0
58

ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తిచేసుకుంది. మూడో సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే, ఈ సీజన్‌ నిర్వహించే హోస్ట్ కోసం నిర్వాహకులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి కూడా. ఇలాంటి వారిలో హీరో నాని, స్వీటీ అనుష్క, మెగాస్టార్ చిరంజీవి వంటి పేర్లు తెరపైకి వచ్చాయి.

నిజానికి బిగ్‌బాస్-1లో ఎన్టీఆర్, బిగ్ బాస్-2లో నాని హోస్ట్‌గా మెప్పించారు. ఈ రెండు సీజన్‌లు రేటింగ్ పరంగా కూడా కాసులు కురిపించాయి. ఈ మూడో సీజన్ కోసం తొలుత ఎన్టీఆర్‌‌నే సంప్రదించారు. అయితే ఎన్టీఆర్ ‘త్రిపుల్ ఆర్’లో నటించడం వల్ల కుదరదని చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి, అనుష్కలను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునతో ఈ షో నిర్వహించాలని భావిస్తున్నారట. ఇదే విషయంపై ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.