చాలా మంది మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్)తో బాధపడుతుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా, మెండుగా పోషక పదార్థాలు ఉండే డ్రై ఫ్రూట్లను ఆరగించడం వల్ల ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆక్రోట్లు జ్ఞాపకశక్తి పెరిగేందుకు తోడ్పడతాయట. రోజూ గుప్పెడు ఆక్రోట్లు తింటే మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. ఆక్రోట్లను అధికంగా తీసుకున్న వ్యక్తుల్లో నిర్వహించిన పరీక్షలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
వీటిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజలవణాలతోపాటు యాంటీఆక్సిడాంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అనే వృక్ష సంబంధ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ హృదయ, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకారి. ఇది వార్ధక్యంలో వేధించే అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడంలోనూ, తీవ్రత తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.