ఐపీఎల్ టోర్నీకి విశాఖ నగరం ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 8, 10వ తేదీల్లో జరగనున్న రెండు క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లను నగరానికి కేటాయించారు. వాస్తవంగా ఈ మ్యాచ్‌లు చెన్నైలో జరగాల్సి వుంది. ఎన్నికల సందర్భంగా ఇక్కడకు బదిలీ చేశారు. దీంతో నగర క్రీడాభిమానుల్లో సందడి నెలకొంది.
ఇక్కడ మ్యాచ్‌లు ఆడే జట్లు ఏమిటనేవి త్వరలో తెలియనుంది. ప్రస్తుతం ఇంకా మ్యాచ్‌లు జరుగుతుండడంతో క్వాలిఫైయర్స్ ఎవరనేది ఈ నెలాఖరుకల్లా తేలిపోనుంది. నగరంలో వచ్చేనెల 8, 10వ తేదీల్లో జరగనున్న రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో పరుగుల వరద పారేందుకు అనువుగా పిచ్ సిద్ధమవుతోంది.
ఇందుకోసం స్టేడియంలో గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇకపోతే విశాఖ స్టేడియం పిచ్‌ను పరిశీలిస్తే, గతంలో జరిగిన అనేక మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
అసలే ఐపీఎల్.. అందులోనూ టీ-20 మ్యాచ్ కావడంతో మైదానంలోకి దిగీదిగగానే బ్యాట్స్‌మెన్‌లు తమ బ్యాట్లకు పని చెబుతారని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 200 పరుగులకు తక్కువకాకుండా నమోదయ్యేలా విశాఖ పిచ్‌ను తయారు చేస్తున్నట్టు సమాచారం. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉండే ఆటగాళ్లు చెలరేగితే ఇక పరుగుల వరదే పారుతుంది.
కాగా, 2012లో ఇక్కడ రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. 2015లో ఐదు మ్యాచ్‌లు జరుగగా, 2016లో ఆరు మ్యాచ్‌లు, ఇప్పుడు రెండు మ్యాచ్‌లు నగరంలో జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లకు నాలుగోసారి విశాఖ ఆతిథ్యమిచిచ్నట్టు అయ్యింది.