“కంచె”హీరోయిన్ ప్రేమలో పడిందా?

0
48

“కంచె” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన కూడా నటించింది. కానీ, ఆమె ఖాతాలో సరైన హిట్ పడలేదు.

పైగా, ఆమెకు సినీ ఛాన్సులు కూడా అడపాదడపాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విదేశీ బీచ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన రకరకాల ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్స్ ఇచ్చింది.

ఓ ఫోటోలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ సాగరంలో జలకాలాడుతూ.. రెండు చేతి వేళ్లను కలిపి లవ్ సింబల్‌ని ఆవిష్కరించింది. మరొక సాగరతీరంలో తాపీగా నడిచి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తోంది. ఆ పిక్‌లో ప్రగ్య థై షోస్ యూత్‌ని కట్టిపడేసింది.

వేరొక ఫోటోలో తన సోదరితో కలిసి ఓ భారీ గ్రద్ధ ఆకారం విగ్రహం చెంత ఫోజులిచ్చింది. అక్కడికి తన సిస్టర్ కోసమే వెళ్లాల్సి వచ్చిందని సెలవిచ్చింది. మొత్తానికి ప్రగ్యా డీప్ లవ్‌లో ఉందని అర్థమవుతోంది. ఎవరితో అంటే.. వరుసగా ఎడతెరిపి లేకుండా బికినీ బీచ్ సెలబ్రేషన్స్‌తో.. జాలీ ట్రిప్‌లతో లవ్‌లో ఉందని అర్థమవుతోంది.