రక్త సరఫరాను మెరుగుపరిచే పాలకూర…

0
36

ఇటీవలి కాలంలో అనేక మందిని వేధించే సమస్య గుండె జబ్బు. ఒక‌ప్పుడు వ‌యస్సు మీద ప‌డిన వారికే గుండె జబ్బులు వ‌చ్చేవి. కానీ నేడు ప్ర‌జ‌లు అనున‌రిస్తున్న జీవ‌న‌శైలి వ‌ల్ల యుక్త వ‌య‌స్సులోనే అనేక మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు.

గుండె జ‌బ్బుల కార‌ణంగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న‌ది. ఈ వ్యాధి బారినపడకుండా ఉండాలంటే కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనము నిత్యం వ్యాయామం చేయాలి.

పోష‌కాల‌తో కూడిన పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. ధూమపానం, మ‌ద్య‌పానం మానుకోవాలి. నిత్యం పోషకాలతో కూడినా ఆహారం తీసుకోవ‌డం వల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

ట‌మాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. ట‌మాటాల్లో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గించి, ర‌క్త సరఫరా మెరుగు ప‌డుతుంది, ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ క‌ట్ట‌కుండా ఉంటుంది.

వాల్‌న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక బ‌రువును త‌గ్గించి, డ‌యాబెటిస్‌, హైబీపీని అదుపులో ఉంచుతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్లను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

నిత్యం పాల‌కూర‌ను తీసుకోవడం వలన గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. పాల‌కూర‌లో విట‌మిన్ సి, బీటా కెరోటీన్, చెడు కొల‌స్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్‌, విట‌మిన్ బి6, బిటైన్‌, అమైనో ఆమ్లాలు గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ రాకుండా చూస్తాయి.

నిమ్మజాతి ఫలాలు, బాదం, దానిమ్మ, స్ట్రా‌బెర్రీలు వంటివి తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఓట్స్ ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు లేకుండా చూస్తాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేస్తాయి. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి.