మేషం : దైవదీక్షలు విరమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పోటీతత్వం పెరుగుతుంది. స్త్రీల మనోవాంఛలు, యత్నాలు నెరవేరటంవల్ల వారిలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఏ పని తలపెట్టినా ఏకాగ్రత ఎంతో ముఖ్యమని గమనించండి. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సత్కాలం.
వృషభం : చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లోని వారికి పని ఒత్తిడి అధికం అవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి సదవకాశాలు లభిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు విందులు, విలాసాలకు భారీ ధనవ్యయం చేస్తారు. రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు.
మిథునం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రైవేటు సంస్థలలోనివారు ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం.
కర్కాటకం : నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. మీ తొందరపాటుతనంవల్ల సమస్యలు ఎదుర్కోక తప్పదు. షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి. వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్సీ రంగాలలోని వారికి పురోభివృద్ధి.
సింహం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పైనాన్స్, చిట్ఫండ్ రంగాలలోనివారికి మిశ్రమ ఫలితం. ముఖ్యుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెలకువ వహించండి.
కన్య : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ అవసరం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచివి కావని గమనించండి. పత్రికలు, రచనా, కళా రంగాల్లోనివారికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
తుల : నిరుద్యోగులకు ఉపాధి పథకాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పాత సమస్యలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. ఆకస్మిక ఖర్చులవల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. గొర్రె, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లోని వారికి సంతృప్తి కానవస్తుంది.
వృశ్చికం : మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యంవంటి చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఖర్చులు పెరిగినా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. మీ సంతానం ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తారు.
ధనస్సు : పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలం అవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. వ్యవసాయ రంగాలవారి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మకరం : మీ అలవాట్లు, బలహీనతల్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం బాగా విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. మీ యత్నాలకు కుటుంబీకులు, సన్నిహితులు సహకరిస్తారు. స్పెక్యులేషన్ విషయాలపట్ల ఆసక్తి చూపిస్తారు.
కుంభం : స్త్రీలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేపడతారు. ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లోని వారికి ఒత్తిడి, చికాకులు అధికం కాగలవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలుకై చేయు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.
మీనం : ఉద్యోగస్తులకు తోటివారి నుంచి శుభవార్తలు అందుతాయి. స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం అన్నివిధాలా క్షేమదాయకం. ప్రముఖుల సహకారంతో కొన్నిపనులు సానుకూలం అవుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక విషయాలలో ఒకింత పురోభివృద్ధి కానవస్తుంది. ధనం అధికంగా వ్యయం చేస్తారు.