ఐపీఎల్‌లో కోహ్లీ సేన హ్యాట్రిక్ విజయం.. పంజాబ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపు

0
60
Virat-Kohli-RCB-beat-KXIP
Virat-Kohli-RCB-beat-KXIP

ఐపీఎల్‌లో కోహ్లీ సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ అదిరిపోయే మ్యాచ్‌‌కు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. అభిమానులకు అసలు మజా అందించింది. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో పంజాబ్‌‌పై బెంగళూరు పై చేయి సాధించింది. 17 పరుగుల తేడాతో ఆర్సీబీ విక్టరీ కొట్టింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ పార్దివ్ పటేల్.. కెప్టెన్ కోహ్లీతో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అనంతరం 10 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును డివిలీయర్స్, స్టోయినిస్ ఆదుకున్నారు. ఏబీ మిస్టర్ 360 అని మరోసారి నిరూపించుకున్నాడు. 44 బంతుల్లో 7 సిక్సులు, 3 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. అటు స్టొయినీస్ 46 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ గేల్, రాహుల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. కానీ లోయర్ ఆర్డర్ బాట్స్ మెన్ విఫలమవడంతో పంజాబ్ 20 ఓవర్లలో 185 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్ ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.

82 పరుగులతో ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో 4వ విజయంతో బెంగళూరు 8 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.