తమిళ దర్శకుడు రాఘవ లారెన్స్. ఈయన తాజా చిత్రం కాంచన-3. హారర్ కామెడీ థ్రిల్లర్ జోన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. వీరిలో ఓవియా, వేదిక, నిక్కి తంబోలితో పాటు మూవీ ఆకర్లో ఓ రష్యన్ భామ కనిపిస్తుంది. ఆమె పేరు రి డిజావి అలెగ్జాండ్రా. ఈమె ఓ మోడల్. ఈమె మోడలింగ్ చేస్తూ, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలోని రాజా అన్నామలై పురంలో నివశిస్తోంది.
ఈమె ఇటీవల ఓ ఫోటోగ్రాఫర్ మీద కంప్లయింట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. రూపేష్ కుమార్ అనే ఫోటోగ్రాఫర్ తనను సెక్స్ కోసం వేధించినట్లు ఆమె ఆరోపించారు. తనకు చాలా మంది సినిమా వాళ్లతో పరిచయం ఉందని, నీ ఫోటోస్ చూపించి అవకాశాలు వచ్చేలా చూస్తాను అని…. రూపేష్ కుమార్ ఫోటో షూట్ కోసం తనను పిలిపించాడని, ఫోటో షూట్ అయ్యాక తనతో పడుకోవాలని బలవంతం చేశాడని రి డిజావి అలెగ్జాండ్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోరిక తీర్చడానికి ఒప్పుకోక పోవడంతో…. ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె చేసిన ఆరోపణలు నిజమని తేలింది. దీంత రూపేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, అలెగ్జ్రాండ్ర నటించిన ‘కాంచన-3′ గతవారం విడుదలైంది. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.