విక్కీ కౌశల్‌క తన ఫస్ట్ కిస్ : శ్రీదేవి కుమార్తె

0
57

అతిలోకసుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. బాలీవుడ్ వెండితెరపై ‘దఢక్’ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడించింది. తన తొలి ముద్దు మాత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు పెడతానని తేల్చి చెప్పింది.

టీవీ రియాలిటీ షో ‘బీఎఫ్ ఎఫ్ విత్ వోగ్’ కార్యక్రమంలో హోస్ట్ నేహా ధూపియా అడిగిన ప్రశ్నకు జాన్వీ అలా సమాధానం చెప్పింది. ‘సే ఇట్ ఆర్ స్ట్రిప్ ఇట్’ అనే గేమ్ కేటగిరీలో జాన్వీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఒకవేళ ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ – కార్తీక్ ఆర్యన్‌లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు అని ప్రశ్నిస్తే.. ఎలాంటి తడబాటు లేకుండా “యూరి” కథానాయకుడు విక్కీ కౌశల్‌ అని తేల్చి చెప్పింది. రొమాంటిక్ కామెడీ లుకా చుప్పీతో కార్తీక్ ఆర్యన్ ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నాడు.

ఇకపోతే, యూరి చిత్రంతో సంచలన విజయం అందుకున్న విక్కీ కౌశల్‌కి యువతరంలో అంతే ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరూ బాలీవుడ్‌లో జోరుమీద ఉన్న యువహీరోలుగా పాపులరయ్యారు. అయితే జాన్వీ మాత్రం తొలి ముద్దు కోసం విక్కీ కౌశల్‌నే ఎంచుకుంది. జాన్వీ చెప్పిన సమాధానంతో విక్కీ కౌశల్ తెగ సంబరపడిపోతుంటే.. మిగిలిన బాలీవుడ్ కుర్రహీరోలు మాత్రం ఒకింత షాక్‌కు గురయ్యారు.