హవా తగ్గని రాములమ్మ.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా..

0
63

నిన్నటితరం హీరోయిన్‌ విజయశాంతి. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు. అగ్రకథానాయకులందరి కాంబినేషన్‌లో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకి ప్రాధాన్యతనిస్తూ సినిమాలను దూరం పెట్టారు. అలా నటనకి విజయశాంతి దూరమై చాలాకాలమే అయింది.

కానీ, త్వరలోనే ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితేనే బాగుంటారని భావించి ఆయన ఆమెను సంప్రదించి ఒప్పించడం జరిగింది.

విజయశాంతికి గల క్రేజ్ తెలిసిందే గనుక, ఆమెకి పారితోషికంగా ఎంత ముడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం ఆమె రూ.2 కోట్లు అడిగారనీ, కోటి నుంచి కోటిన్నర ఆమెకు ముట్టనుందని ఫిల్మ్ నగరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే ఒక స్టార్ హీరోయిన్ తీసుకునేంత పారితోషికం విజయశాంతికి ముడుతోందన్న మాట.