కట్టుకున్న భర్తను 2 నిమిషాల్లో చంపేసింది.. ఎవరు?

0
41

ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులోని మిస్టరీని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రోహిత్ భార్య అపూర్వే హత్య చేసినట్టు తేల్చేశారు. ఈ అనర్థం మొత్తానికి ఒక్క వీడియో కాల్‌ కారణమని తేల్చారు!. ఈ కేసు వెనుక ఉన్న నిజాలను పోలీసులు వెల్లడించారు.

‘ఈ నెల 15న రోహిత్‌ ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి కారులో వస్తున్నాడు. డిన్నర్‌ గురించి అడిగేందుకు అపూర్వ ఆయనకు వీడియో కాల్‌ చేసింది. ఆ సమయంలో కారులో మరో మహిళ ఉంది. ఆమె కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించినా.. గాజుల శబ్దం, దుస్తులు అపూర్వకు కనిపించాయి. రాత్రి 10 గంటలకు రోహిత్‌, ఆయన తల్లి ఉజ్వల తివారీ, ఇతర బంధువులు కలిసి ఢిల్లీలోని ఇంటికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న రోహిత్‌కు అపూర్వ భోజనం వడ్డించింది.

అరగంట తర్వాత ఉజ్వల మాట్లాడాలంటూ రోహిత్‌ దంపతులను పిలిచింది. కొద్దిసేపటికి రోహిత్‌ తనకు బాగాలేదంటూ గదిలోకి వెళ్లిపోయాడు. అర్థరాత్రి 12.45 గంటలకు అపూర్వ భర్త గదిలోకి వెళ్లి.. కారులోని మహిళ గురించి నిలదీసింది. ఆమె, తాను ఒకే గ్లాసులో మద్యం సేవించినట్లు రోహిత్‌ బదులిచ్చాడు. అంతే ఆయన మీద పడి గొంతు పట్టుకొని ఊపిరాడకుండా చేసింది. మద్యం మత్తుతో పాటు బలహీనంగా ఉండడంతో రోహిత్‌ ప్రతిఘటించలేకపోయాడు. కేవలం రెండు నిమిషాల్లోనే అతను మృతి చెందాడు.

రోహిత్‌ మరణించిన తర్వాత కూడా అపూర్వ దాదాపు గంటకు పైగా అక్కడే ఉండిపోయింది. ఉదయం 9 గంటలకు పనిమనిషి గోలు.. రోహిత్‌ గదిలోకి వెళ్లినప్పటికీ నిద్రపోతున్నాడనుకొని తిరిగి వచ్చేశాడు. తిలక్‌ లేన్‌లోని ఇంటికి వెళ్లిన ఉజ్వల రోహిత్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అపూర్వ మాత్రం నిద్రపోతున్నాడని చెబుతూ వచ్చింది.

మధ్యాహ్నం 3.30 గంటలకు గోలును వెళ్లి శేఖర్‌ను లేపమని చెప్పింది. అయితే రోహిత్‌ ఎంతకీ లేవడం లేదని, ముక్కులో నుంచి రక్తం కారుతోందని చెప్పాడు. నోట్లో నుంచి రక్తం రావడంతో ఆస్పత్రికి తరలించారు. రోహిత్‌ అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు’ అని పోలీసులు వివరించారు.