చ‌ర్మంపై మ‌చ్చ‌లు పోవాలంటే ఆ నీటిని తాగండి..

0
47

కొబ్బ‌రినీళ్లలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వేసవిలో ప్రతి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇపుడు తెలుసుకుందాం.

* ప్రతి రోజూ ప‌ర‌గ‌డుపున కొబ్బ‌రి నీళ్లును తాగ‌డం వ‌లన శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
* శ‌రీరంలో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.
* మూత్ర నాళాలు, కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి. చ‌ర్మంపై మ‌చ్చ‌లు తొలగిపోతాయి.
* చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు.
* శరీరానికి తెలియని కొత్త శక్తి వస్తుంది. కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి నేత్ర సమస్యలు ఉండవు.
* జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
* డీహైడ్రేష‌న్ బారిన ప‌డినవారికి ఉద‌యాన్నే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగిచడం చాలా మంచిది.