మలైకా అరోరా నాకు ప్రత్యేకం.. అయినా ఇప్పుడే పెళ్లేంటి?

0
53
Arjun kapoor
Arjun kapoor

బాలీవుడ్ నటి మలైకా అరోరాతో ఇటీవల బీచ్‌లో మస్తు మజా చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్ కపూర్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని మీడియా కోడై కూసింది. ఈ వార్తలపై తాజాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమారుడు, హీరో అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. మలైకా తనకెంతో ప్రత్యేకం అన్నాడు. ఏ విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేం. తనకు 33 ఏళ్లేనని, అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు. తప్పుడు వార్తలు స‌ృష్టించడం మంచిది కాదని హితవు చెబుతూ, ప్రతిసారీ వాటిపై స్పందించలేమని అన్నాడు.

ఇంకా పెళ్లి గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదు. తనకు వివాహమైతే మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ కాలంలో ఏదీ ఎక్కువ రోజులు దాచలేం. తప్పుడు వార్తలు సృష్టించడం మంచిది కాదని క్లాస్ పీకాడు. ఎక్కువ సేపు వీటికి సమయం కేటాయిస్తే అలసిపోతాం. వదంతులు ఎంతగా ఎక్కువైపోయాయంటే.. ఇదివరకు అవి నమ్మేవారే ఇప్పుడు విసుగెత్తి ఊరుకుంటున్నారని అర్జున్ కపూర్ చెప్పాడు.