బుల్లితెరపై వ్యాఖ్యాతగా, వెండితెరపై నటీమణిగా రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న యాంకర్ ఉదయభాను. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక శైలిని చాటుకుంటోంది. కొన్ని కార్యక్రమాలకు తాను తప్ప వ్యాఖ్యాతగా మరెవరూ వ్యవహరించలేరు అన్న రీతిలో.. స్మాల్ స్క్రీన్‌పై సంచలనం ఉదయభాను.
ఈ క్రమంలో తన స్నేహితుడు విజయ్ను పెళ్లిచేసుకుని కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో కొన్ని నెలల పాటు బుల్లితెరకు దూరమైంది. తాజాగా రీ-ఎంట్రీ ఇచ్చింది. వ్యాఖ్యాతగా ఎక్కువ గ్యాపే వచ్చినా మునుపటి జోష్‌కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఉదయభాను బుల్లితెరపై దుమ్మురేపుతోంది. అందుకే ఉదయభాను జోష్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవాలనే ఉద్దేశ్యంతో తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వహకులు ఆమెను సంప్రదించారట.
‘బిగ్ బాస్-3’లో కంటెస్టెంట్‌గా పాల్గొనాలనే కోరికను వెల్లిబుచ్చారట. అయితే అందుకు ఆమె చెప్పిన పారితోషికం విని వారికి దిమ్మదిరిగిపోయారట. ‘బిగ్ బాస్-3’లో పార్టిసిపేట్ చేయడానికి రోజుకి రూ.2 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట.
ఈ లెక్కన 100 రోజుల పాటు సాగే ఈ షోలో చివరివరకూ కొనసాగితే ఒక్క ఉదయభానుకే రూ.2 కోట్లను రెమ్యూనరేషన్‌గా ఇవ్వాల్సి ఉంటోంది. ఆ మొత్తం ‘బిగ్ బాస్-3’ విన్నర్ సాధించే ప్రైజ్‌మనీ కంటే చాలా ఎక్కువ. దీంతో షో నిర్వహకులు ఉదయభాను డిమాండ్‌ను పెండింగ్‌లో పెట్టారట. కాగా, ఈ షో జూన్ లేదా జూలై నెలలో ప్రారంభంకానుంది.